27 August, 2026 | 5:26 PM

రోడ్డు ప్రమాదంలో మరో విద్యార్థి మృతి

27-08-2026 01:54 PM

ఇబ్రహీంపట్నంలో ఘోరం

​ఇబ్రహీంపట్నం (ఆగస్టు 27, (విజయ క్రాంతి): ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని జేబీ వెంచర్ సమీపంలో బుధవారం రాత్రి 09:30 గంటలకు చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతున్న మరో విద్యార్థి మరణించాడు. దీంతో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య రెండుకు చేరింది. గురునానక్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు సమీపంలోని హాస్టల్‌లో నివాసముంటున్నారు. బుధవారం రాత్రి భోజనం ముగించుకుని వారంతా కలసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, మాల్ వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఒక అశోక్ లేలాండ్ వాహనం వెనుక నుంచి వీరిని బలంగా ఢీకొట్టింది.​ 

ఈ ప్రమాదం నుంచి ఒక విద్యార్థి తృటి లో బయటపడగా, మిగతా నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో హర్ష అనే విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలతో మహనీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివరాజ్ అనే మరో విద్యార్థి గురువారం కన్నుమూశాడు. 

నిజామాబాద్ కు చెందిన ​హర్ష (18)  బీ .టెక్ మొదటి ఇయర్ ,కాగా నిర్మల్ జిల్లా కు చెందిన ​శివరాజ్ (18) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి) ప్రస్తుతం ​అక్షయ్, ​కౌముది రెడ్డి లది కరీంనగర్. ఇదే ప్రమాదం లో ​బూరి నారయ్య (50) ఆటో డ్రైవర్,నాగోల్ లో నివాసం కాగా మాడుగుల మండలం అండుగుల స్వంత నివాసం ​ప్రమాదంపై సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.