17 April, 2026 | 2:14 AM

తగ్గేదేలేదు.. తస్సాదియ్యా..

17-04-2026 12:00 AM

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత హీరోయిన్‌గా దర్శకురాలు నం దినీరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో దిగ్‌నాథ్, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్ని పోషించారు. శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష ముఖ్యపాత్రల్లో కనిపించనున్నా రు. వేసవి కానుకగా మే 15న విడుదల కానున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే అంచనాలు పెంచేసింది.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ను మేకర్స్ విడుదల చేశారు. ‘త త్త త్త తస్సదియ్యా తగ్గేదేలేదు హొయ్యా.. అమ్మాయి అన్నాక ఆమాత్రం ఉండాలే..’ అంటూ సాగుతోందీ గీతం. సంతోష్ నారాయణన్ బాణీ కట్టిన ఈ పాటకు రెహమాన్ సాహిత్యాన్ని అందించగా.. చిన్మయి శ్రీపాద, పుణ్య సెల్వ ఆలపించారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్; కెమెరా: ఓం ప్రకాశ్; యాక్షన్: లీ విఠేకర్, ఏజాజ్ గులాబ్; ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల; ప్రొడక్షన్ డిజైన్: ఉల్లాస్ హైదర్; నిర్మాతలు: సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్; స్టోరీ, స్క్రీన్‌ప్లే: రాజ్ నిడిమోరు, వసంత్ మరిన్‌గంటి, సీతా మీనన్; దర్శకత్వం: నందినీరెడ్డి.