28 August, 2026 | 9:41 AM

కోట గుళ్ళలో సీఐ నరేష్ కుమార్ గౌడ్ పూజలు

27-08-2026 12:23 PM

గణపురం,ఆగస్టు 27 (విజయ క్రాంతి): ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో గురువారం సీఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఇటీవల బదిలీల్లో భూపాలపల్లి సిఐగా పనిచేస్తున్న ఆయన వరంగల్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.