29 March, 2026 | 4:07 AM

అంగన్‌వాడీ చిన్నారుల కోసం తొలి ముద్ద

29-03-2026 02:15 AM

బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాం తి): అంగన్వాడీ చిన్నారులకు కొత్త బ్రేక్‌ఫాస్ట్ ‘తొలి ముద్ద’ పథకం పారంభమైంది. ఇక నుంచి చిన్నారులకు రెడీ టూ కుక్ఫుడ్ (ఉ ప్మా, కిచిడీ మిక్స్)ను బ్రేక్‌ఫాస్ట్‌గా అందించనున్నారు. ఈ కొత్త పథకాన్ని అసెంబ్లీ కమి టీ హాల్లో  ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివా రం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గతంలో దేశంలో నిరక్షరాస్యతను తగ్గించేందుకు, వ్యవసాయ అభి వృద్ధి కి తొలి ప్రధాని నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌కు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. అందు వల్లే  దేశంలో ప్రస్తుతం ఫుడ్ సెక్యూరిటీ ఉం దన్నారు.

కానీ, న్యూట్రిషన్ ఫుడ్ అందడం లేదని సీఎం ఆందోళన వ్యక్తం చే శారు. అం దుకే ప్రభుత్వం బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టికాహారం అందిస్తోందన్నా రు. తాజాగా బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను కూడా ప్రారంభించామన్నారు. ప్రభుత్వం ఎంత మంచి ప్రణాళికలు చేసినా.. అమలు చేయాల్సింది అంగన్వాడీ టీచర్లు మాత్రమేనని సూచించారు. అందుకే ఈ ప్రభుత్వం మీపై గురుతర బాధ్యత పెట్టిందన్నారు.

అంగన్వాడీ సిబ్బందికి సెల్ ఫోన్లు 

అంగన్వాడీ చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకుని వారికి పౌష్టికాహారం అందించాలని సీఎం సూచించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్‌కు మొబైల్ ఫోన్లు సీఎం పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు అవసరమై న ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబసభ్యుల్లా భావిస్తోందని, మీ సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామన్నారు. ఏ మాత్రం ఆర్థిక వెసులుబాటు కలిగినా ముందు మీ సమస్యలనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం, చైల్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ సీతాదయాకర్‌రెడ్డి పాల్గొన్నారు.