15 April, 2026 | 3:57 AM

మసకబారుతున్న జైళ్ల శాఖ!

15-04-2026 12:52 AM
  1. ముఖ్యమంత్రి వద్దే హోంశాఖ
  2. ప్రత్యేకంగా మంత్రి లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ఉన్నతాధికారుల తీరు
  3. వేధింపులు పెరిగిపోతున్నాయని సిబ్బంది ఆవేదన
  4. ఆత్మహత్యకు యత్నించిన జైలు సూపరింటెండెంట్ స్థాయి అధికారి?
  5. జైళ్ల శాఖను ప్రక్షాళన చేయాలని సిబ్బంది విజ్ఞప్తి

హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయ క్రాంతి): రాష్ట్రంలో జైళ్లశాఖ మసకబారుతున్నది. ప్రధాన జైళ్లతోపాటు సబ్ జైళ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా మా రింది. హోంశాఖకు మంత్రి లేకపోవడం, ముఖ్యమంత్రి ఆ శాఖను పట్టించుకోకపోవడంతో జైళ్ల లో అధికారుల ఇష్టారాజ్యం కొనసాగుతున్నది. జైళ్ల శాఖలో ఉన్నతాధికారుల వేధింపులు పెరిగిపోతున్నాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నచిన్న విషయాలకు కూ డా జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రప్పించి తమ అక్కసు వెళ్లగక్కుతున్నారని వాపోతున్నారు.

సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ స్థాయి అధికారి ఒకరు ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకో లేక ఆత్మహత్యకు ప్రయత్నించారని తెలిసింది. జైళ్లశాఖ ఉన్నతాధికారుల వేధింపులకు సంబంధిం చిన సూసైడ్ నోట్ లభించినట్టు సమాచారం. అందులో ప్రధాన బాధ్యులుగా జైళ్లశాఖ ఐజీలు, డీజీ పేర్లను కూడా ప్రస్తావించినట్టు తెలిసింది. తన చావుకు వారే బాధ్యులని బాధిత అధికారి లేఖలో రాసుకున్నట్టు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు.

జైళ్లశాఖ పరిపాలనను గాలికి వదిలేసిన ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందిని పీడించుకుతింటున్నారని అధికారులు వాపోతున్నారు. ఆకారణంగా బదిలీలు, అటాచులు చేస్తూ జైలర్ నుంచి సూపరింటెండెంట్ల స్థాయి అధికారుల వరకు నరకం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జైళ్లశాఖను సరిదిద్దాలని, అవినీతికి అడ్డుకట్ట వేయాలని మీడియాకు, ప్రభు త్వానికి లేఖలు అందుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

అధికారుల నిర్లక్ష్య వైఖరితో పటిష్టమైన నిఘా వ్యవస్థ లేనిచోట ఖైదీలు జైళ్ల నుంచి తప్పించుకొని పారిపోవడం, పారిపోయేందుకు ప్రయత్నించడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అవినీతి అధికారుల తీరుతో నిజాయితీ గల అధికారులకు కూడా తిప్పలు తప్పడం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సిబ్బం ది కోరుతున్నారు. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రత్యేక దృష్టిసారించి జైళ్ల శాఖను ప్రక్షాళన చేయాలని సిబ్బంది విజ్ఞప్తిచేస్తున్నారు.