15 April, 2026 | 5:17 AM

రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలి

15-04-2026 12:52 AM

ఎస్‌ఐ చలి కంటి నరేష్

గరిడేపల్లి, ఏప్రిల్ 14: రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలని గరిడేపల్లి ఎస్‌ఐ చలికంటి నరేష్ అన్నారు. మంగళవారం మండలంలోని కీతవారిగూడెంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత చెడు బాటలో నడవకుండా మంచి మార్గంలో నడిచి అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరారు.

యువ కులందరూ ఐక్యమత్యంతో నడుచుకోవాలన్నారు.. ప్రస్తుతం విపరీతంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై యువత అవగాహన పెంచుకోవడమే కాకుండా ఇతరులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బొల్లేపల్లి రామనాథం, పిడమర్తి అంజి, అంబేద్కర్ యూత్ సభ్యులు అమరారపు శివాజీ, కడప అనిల్, బండారు వేణు, అమరారపు భరత్, బండారి విజయ్, గురవయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.