19 June, 2026 | 11:05 AM

Breaking News

ఫిన్లాండ్‌లో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్‌.. ఇంకా వీడని మిస్టరీ   •   అగ్రహారంలో తీవ్ర విషాదం.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తండ్రి ఆత్మహత్య   •   పేరుకే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం   •   సింగరేణిలో ఐదో రోజు కవిత బాయిబాట కార్యక్రమం   •   నల్గొండలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి   •   పుడమి తల్లి గర్భంలోనే పాడై పోతున్న అంకురం   •   దమ్ముంటే కేసీఆర్‌ ను టచ్ చేసి చూడు..!   •   నియోజకవర్గ రిపోర్టర్లకు జిల్లా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి   •   అక్రమ మొరం తవ్వకాలపై పోలీసుల దాడి.. ట్రాక్టర్, జేసీబీ స్వాధీనం   •   మధిరలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై బీఎల్ఓ లకు శిక్షణ   •  

ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలి

19-06-2026 12:00 AM

నిర్మల్ జూన్ 18 ( విజయ క్రాంతి): బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పొన్నం నారాయణ గౌడ్‌ నిర్మల్. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో ప్రవేట్ విద్యాసంస్థలు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఆర్థిక దోపిడి కి పాల్పడుతున్నాయని వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పొన్నం నారాయణ గౌడ్ డిమాండ్ చేశారు.

నిర్మల్ జిల్లాలో ప్రవేటు కార్పోరేట్ విద్యాసంస్థల్లో నిబంధనలను అతిక్రమించి ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. పాఠశాలలో పుస్తకాలు వర్క్ బుక్కులు స్టడీ మెటీరియల్ పేరుతో పిల్లల తల్లిదండ్రుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని స్కూళ్లలో అనుమతి లేకుండా నిర్వహించబడుతూ నవోదయ సైనిక్ ఇతర శిక్షణల పేరుతో మోసం చేసి పేద మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతున్నారని తెలిపారు.

జిల్లాలో అనుమతి లేకుండా నిర్వహించబడుతున్న ప్రైవేటు పాఠశాలలపై జిల్లా విద్యాశాఖ అధికారి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలను అతిక్రమించి పాఠశాలలో పుస్తకాలు వర్క్ బుక్కులు అమ్ముతే అటువంటి పాఠశాలల ముందు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామన్నారు. కొన్ని పాఠశాలలో స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండా నడుపుతున్నారని ప్రమాదాలు జరిగితే ఎవరూ బాధ్యులని ఆయన ప్రశ్నించారు.

జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థలు కార్పొరేట్ సంస్థల్లో అర్హత లేని ఉపాధ్యాయులను నియమించుకొని విద్య బోధన చేస్తున్నారన్నారు. ఐఐటి ఇతర కోర్సుల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాల దానికి సంబంధించిన లెక్చరర్లను నియమించుకోకుండా ఉన్న సిబ్బందితో సర్దుబాటు చేస్తున్నారని ఇది నిబంధనలకు అతిక్రమించడమేనని తెలిపారు. 

జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యాసంస్థల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలు అధిక ఫీజులపై బీసీ సంక్షేమ సంఘం త్వరలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి నిబంధనలను అక్రమించిన విద్యాసంస్థలపై వెంటనే చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.