30 April, 2026 | 3:18 AM

సినిమా మొత్తం ఫ్రెండ్‌షిప్ వైబ్‌తో ఉంటుంది

30-04-2026 01:52 AM

తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం ‘గాయపడ్డ సింహం’. ఇందులో హీరో శ్రీవిష్ణు స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించగా, జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాను పవన్ సాదినేని సమర్పణలో కళ్యాణచక్రవర్తి మంథిన, భానుకిరణ్ ప్రతాప, విజయ్‌కృష్ణ లింగమనేని, ఉమేశ్ బన్సాల్ నిర్మించారు. మే 1న థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా మేకర్స్ వీసా స్టాంపింగ్ పేరుతో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ముఖ్యఅతిథి హీరో నారా రోహిత్ మాట్లాడుతూ. “గాయపడ్డ సింహం’ టీమ్ అందరికీ  మెమొరబుల్ ఫిల్మ్ అవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు. ‘సినిమా చాలా అద్భుతంగా వచ్చింద’ని మరో అతిథి హీరో శ్రీవిష్ణు తెలిపారు.

ఫరియా మాట్లాడుతూ.. “ప్రేక్షకులు ఆశించిన దానికంటే ఎక్కువ వినోదాన్ని ఈ సినిమా ఇస్తుంది” అన్నారు. ‘ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటూ బయటికి వస్తార’ని హీరోయిన్ మానస చౌదరి చెప్పారు. ‘సినిమా మొత్తం ఫ్రెండ్‌షిప్ వైబ్‌తో ఉంటుంద’ని  పవన్ సాదినేని అన్నారు. ‘పవన్ కథ విన్నంతసేపు నవ్వుతూనే ఉన్నాన’ని నిర్మాత భాను కిరణ్ తెలిపారు. చిత్ర దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్, ప్రొడ్యూసర్ సందీప్, మ్యూజిక్ డైరెక్టర్ స్వీకర్ అగస్తి, సినీ ప్రముఖులు, చిత్రబృందం మాట్లాడారు.