ప్రజాసంక్షేమంలో విద్యుత్ శాఖ కీలకం
ములకలపల్లి, మే 7 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రజలకు విద్యుత్ శాఖ ద్వారా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ములకలపల్లి విద్యుత్ ఏఈ నరేష్ తెలిపారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ములకలపల్లిలోని రైతు వేదికలో విద్యుత్ శాఖ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఏ ఈ నరేష్ విద్యుత్ శాఖకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలు, విద్యుత్ శాఖచే అమలుపరుస్తున్న పలు పథకాలు, గృహజ్యోతి, పీఎంజుగా, పీఎంకుసుమ్, ప్రజాబాట, విద్యుత్ వినియోగదారులకు, రైతులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు, విద్యుత్ ప్రమాదాలపై రైతులకు, విద్యుత్ వినియోగదారులకు అవగాహన విద్యుత్ శాఖ తీసుకుంటున్నటువంటి భద్రతా చర్యలను వివరించారు. ఈ కార్యక్రమానికి ముల్కలపల్లి మండల వ్యవసాయ అధికారి అరుణ్ బాబు ములకలపల్లి, తిమ్మంపేట, మూకమామిడి,సర్పంచులు చంద్రలేఖ, తుర్రం శ్రీనివాసరావు, ఆదిలక్ష్మి, వివిధ శాఖలకు చెందిన అధికారులు, విద్యుత్ సిబ్బంది, విద్యుత్ వినియోగదారులు రైతులు పాల్గొన్నారు.






