1 July, 2026 | 11:06 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

నిరుపేదలు సీఎం రిలీఫ్ ఫండ్‌ను సద్వినియోగం చేసుకోవాలి

01-07-2026 12:00 AM
  1. లబ్ధిదారులకు రూ.1.70 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
  2. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): సీఎం రిలీఫ్ ఫండ్‌ను పేదలు సద్వినియోగం చేసుకోవాలని ముషీరాబాద్ ఎ మ్మెల్యే ముఠా గోపాల్ అన్నా రు. ఈ మేరకు మంగళవారం గాంధీనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ ఫండ్ కోసం గతంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు నలుగురికి 1లక్షా 70 వేల రూపాయల విలువగల చెక్కులను ముషీరాబాద్ శాసన సభ్యులు ముఠా గోపాల్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలు సీఎం రిలీఫ్ ఫండ్ ను ఉపయోగించుకోవాలని ఆయన సందర్భంగా కోరారు.  ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షులు వల్లాల శ్యామ్ యాదవ్, వై. శ్రీనివాస్, శంకర్ ముదిరాజ్, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, కార్యదర్శి సాయి కృష్ణ, బింగినవీన్, మహమ్మద్ అలీ, రామచందర్, ముదిగొండ మురళి, శంకర్ గౌడ్, ప్రభాకర్, శ్రీహరి, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.