7 May, 2026 | 1:59 AM

ప్రేమలో చీకటి కోణం.. అగ్లీ స్టోరీ

07-05-2026 01:03 AM

నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ‘అగ్లీ స్టోరీ’. సుభాషిని, కొండా లక్ష్మణ్ నిర్మాతలు. దీనికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం ప్రణవ స్వరూప్. ప్రేమలోని చీకటి కోణాన్ని ధైర్యంగా చూపించే ఈ మూవీ ట్రైలర్‌ను ‘భీమ్లా నాయక్’ డైరెక్టర్ సాగర్ కే చంద్ర బుధవారం విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నందు మాట్లాడుతూ.. “ఈ పాత్ర నాకు కొత్త ఛాలెంజ్. ఆసక్తికరమైన థ్రిల్లింగ్ సీన్స్‌తో నిండిన స్టోరీ ఇది.

ప్రేక్షకులు ఈ సినిమాని కచ్చితంగా ఆస్వాదిస్తారు” అన్నారు. ‘ఈ చిత్రం ద్వారా ప్రేమ వాస్తవాలను చూపించాలనుకున్నాం. ఇంత అద్భుతమైన సినిమాలో అవకాశం రావడం నా అదృష్టం’ అని కథానాయకి అవికా గోర్ చెప్పారు. డైరెక్టర్ ప్రణవ స్వరూప్ మాట్లాడుతూ.. ‘ప్రతి ప్రేమకు ఓ చీకటి వైపు ఉంటుంది. ఆ సత్యాన్ని బలంగా చెప్పడమే మా లక్ష్యం” అని తెలిపారు. ‘సినిమా చాలా బాగా వచ్చింద’ని నిర్మాతలు సుభాషిణి, లక్ష్మణ్ తెలిపారు. నిర్మాత బెక్కం వేణు గోపాల్, సాగర్ కే చంద్ర కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.