బక్రీద్ కు గోవుల కుర్బానీ.. ఇవ్వవద్దు
గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి.
మైనార్టీ నాయకులు మొహమ్మద్ నసీరుద్దీన్
తుంగతుర్తి,(విజయక్రాంతి): బక్రీద్ పండుగ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ముస్లింలు గోవులను కుర్బానీ ఇవ్వవద్దని నియోజకవర్గ మైనార్టీ సంఘం నాయకులు మొహమ్మద్ నసీరుద్దీన్ అన్నారు, బుధవారం విలేకరులతో మాట్లాడుతూ భారతదేశంలో గోవును కోట్లాదిమంది హిందువులు, పవిత్రంగా గోమాతగా పూజిస్తారని అన్నారు.
మతసామరస్యాన్ని కాపాడుకునేందుకు హిందువుల మనోభావాలను గౌరవిస్తూ, బక్రీద్ పండుగ సందర్భంగా గోవులను కుర్బాని ఇవ్వకూడదని మత పెద్దలు తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయమని అన్నారు, దేశంలో శాంతి సోదర భావం, సౌబ్రాతత్వం, నెలకొనాలంటే ప్రజలు ఒకరి మతాలను మరొకరు పరస్పరం గౌరవించుకోవాలని అన్నారు, గోరక్షణ కేవలం ఒక మతానికి సంబంధించినది కాదని అది భారతీయ సంస్కృతిలో వ్యవసాయం రంగంలో గోవు వెన్నుముకని అన్నారు, అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గోవును జాతీయ జంతువుగా ప్రకటించి చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరారు






