27 May, 2026 | 2:51 PM

మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

27-05-2026 02:11 PM

వాంకిడి, విజయక్రాంతి: వాంకిడి మండలంలోని ఎనోలి, బంబా ర, కోసర గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్లను బుధవారం ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ సర్పంచ్, ఉప సర్పంచ్ లతో కలిసి పంపిణీ చేశారు. వాంకిడి  ఉప సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు దీపక్ ముండే, బాంబర సర్పంచ్ కృష్ణ, పార్టీ నాయకులతో కలిసి ఆయన ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కూలీలకు అందుతున్న త్రాగునీరు, నీడ సదుపాయాలపై ఫీల్డ్ అసిస్టెంట్‌ను  అడిగి తెలుసుకున్నారు. వచ్చే నెల జూన్ 1వ తేదీన కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద నిర్వహించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు మండల ప్రజలు, ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బహిరంగ సభ జయప్రదం చేయాలని ఆయన కోరారు.