వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలి.
27-05-2026 02:10 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలపై కలెక్టర్ ఆరా
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): జిల్లా బల్మూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, మందుల లభ్యతపై వివరాలు తెలుసుకున్నారు. ఏఎన్ఎం కిట్‌లో పాము కాటు, కుక్క కాటు వ్యాక్సిన్లు, చిన్నారుల టీకాలు ఉన్నాయా అని పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత పాటించాలని, గర్భిణీలు, చిన్నారుల వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.






