27 May, 2026 | 2:53 PM

మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు

27-05-2026 02:08 PM

పెద్దపల్లి,మే27(విజయక్రాంతి): ఓదెల మండలంలో పలు బాధిత కుటుంబాలను ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు(Government Whip Vijaya Ramana Rao) బుధవారం పరామర్శించారు. మండలంలోని రూపునారాయణపేట గ్రామంలో శ్రీనివాస్, రాజు, మహిపాల్ మాతృమూర్తి అడ్డె భూలక్ష్మి మరణించడంతో వారి పార్థివ దేహానికి,  అదే గ్రామంలో ఇటీవల కాలంలో మరణించిన వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించి, అనంతరం శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఏఎంసి డైరెక్టర్ దాగేటి రామచంద్రం  తండ్రి  దాగేటి జానయ్య  మరణించడంతో వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను  రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే  విజయరమణ రావు పరామర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్ లు,  కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.