calender_icon.png 9 February, 2026 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫెసిలిటేషన్ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్

09-02-2026 12:12:58 AM

మెదక్, ఫిబ్రవరి 8 (విజయ క్రాంతి)ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన నర్సాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఫెసిలిటేషన్ సెంటర్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం సందర్శించారు. ఎంత మంది పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఫెసిలిటేషన్ సెంటర్ లో ఏర్పాట్లను, అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఆదివారం సాయంత్రం నాటితో ముగియగా, కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్యన కౌంటింగ్ హాల్ కు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

కాగా, ఎన్నికల విధుల్లో నియమించబడినపోలీసు సిబ్బంది చివరి రోజైన ఆదివారం పెద్ద సంఖ్యలో ఫెసిలిటేషన్ సెంటర్ కు తరలివచ్చి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియపూర్తి చేసినట్లు వివరించారు. కలెక్టర్ వెంట నర్సాపూర్ ఆర్డిఓ మహిపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, తదితరులు ఉన్నారు.