5 June, 2026 | 2:53 PM

Breaking News

మహిళా సంఘ సభ్యులకు ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్

05-06-2026 01:39 AM

భిక్కనూర్, జూన్ 4(విజయ క్రాంతి): ప్రజా పాలనప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా భిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డీఆర్డీఏ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో మహిళా సంఘ (SHG) సభ్యుల ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. మండలంలోని 12,776 మంది మహిళా సంఘ సభ్యులకు దశలవారీగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ప్రతిరోజూ ఒక వీవో పరిధిలో 50 మంది మహిళలకు ప్రభుత్వం సూచించిన వైద్య పరీక్షలను నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత చికిత్స అందించనున్నట్లు తెలిపారు. తొలి రోజు 30 మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవీందర్ గౌడ్, పీవో డాక్టర్ ప్రదీప్, వైద్యాధికారి డాక్టర్ యామీమా, డీఆర్డీఏ పీడీ ధామోదర్ రెడ్డి, అదనపు డీఆర్డీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ సునీత, ఎంపీడీవో రాజకిరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, సర్పంచ్ బాల్యాల రేఖ సుదర్శన్, ఉపసర్పంచ్ మోహన్ రెడ్డి, మండల సమాఖ్య అధ్యక్షురాలు రాజామణి, ఎన్హెచ్‌ఎం సిబ్బంది, మహిళా సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ వనశ్రీ ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు.