5 June, 2026 | 3:48 PM

ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం నిరోధించాలి

05-06-2026 01:39 AM

జనగామ, జూన్ 4 (విజయక్రాంతి):  తరిగొప్పుల మండలంలోని అబ్దుల్ నాగారం గ్రామంలో సర్పంచ్ కావటి సుధాకర్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో వారు మాట్లా డుతు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన 99 రో జుల కార్యక్రమాలు పారిశుద్ధ్య కార్యక్రమాలు మురికి కాలువల చెత్త నిలువల తొలగింపు వీధి లైట్ల నిర్వహణ వాటర్ సప్లై కేజీలు క చ్చా కాలువల ద్వారా మురికి నీరు మళ్లింపు అర్హత కలిగిన వారికి సంక్షేమ పథకాల దరఖాస్తులు మెడికల్ క్యాంపులు ఎస్సీ ఎస్టీ అ ట్రాసిటీ చట్టం అవగాహన సదస్సులు ఇలా అభివృద్ధి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.

ఈరోజు ప్రభు త్వం రానున్న వర్షాకాలం సీజన్ కు సంబంధించి ముందస్తు ప్రణాళిక కార్యక్రమాలు చేపడుతున్నదని విద్యుత్తు సమస్యలు తలెత్తకుండా చూడడం కోసం ప్రణాళికలు రూపొందించిందని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మురికినీటి నిల్వలు లేకుండా చూసే కార్యక్రమాలు మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా అందుతున్న ఆరోగ్య సేవలు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా చర్య లు చేపట్టడం కోసం అవగాహన కార్యక్రమాలను నిర్వహణ సభ యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. ఈకార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రాణా ప్రతాప్, ఎంపీ ఓ తూర్పు వెంకటేశ్వర్లు, కార్యదర్శి భూక్య లింగం, ఉప సర్పంచ్ నీల సంపత్, వార్డు సభ్యులు, అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.