శనగలపై దళారుల చూపు!
- సెనగకుప్పలపై వాలుతున్న దళారులు.
శనగ పంట కోసి నెలనర అవుతుంది
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు
రేపు మాకు అంటూ అధికారులు కాలయాపన
18 19 20 తేదీల్లో తూఫాన్ సూచన ఉంది మా పరిస్థితి ఏంటి.
వాపోతున్న సెనగ పంట రైతులు
నిజామాబాద్, మార్చి 12 (విజయ క్రాంతి). నిజామాబాద్ జిల్లాలోని శనగ కొనుగోలు కేంద్రాలు లేక రైతులు తీవ్ర ఆవేదన గురవుతున్నారు. తమ శనగ పంటను కోసి 45 రోజులు కావస్తున్నప్పటికిని అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లోని సాలూర రేంజర్ బోధన్ మండలాల్లో ఖరీఫ్ సీజన్లో దాదాపు 15 వేల పైచిలుకు ఎకరాల్లో రైతులు శనిగ పంటను సాగు చేశారు.
ఎన్నో ఆర్థిక వయ ప్రయాసలు కూర్చి పంటను దక్కించుకొని పంట కోసి పూర్తయి నెల రోజులకు పైగా గడుస్తున్నప్పటికిని అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని ఈ విషయమే అధికారులను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని సెనగ రైతులు వాపోయారు. ప్రభుత్వ మద్దతు ధర 5,875 రూపాయలు ఉండగా కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో పంటలకు పంటల వద్దకు వస్తున్న దళారులు 4,200 నుండి 4,500 లోపు దొరకు కొనుగోలు చేస్తామంటున్నారని ఇది ఎలా సాధ్యమవుతుందని రైతులు వాపోతున్నారు.
సిండికేట్ గా ఏర్పడిన దళారులు శనగ పంట కుప్పల వద్ద వాలిపోయి పక్కా ప్రణాళికతో రైతులను మభ్యపెడుతూ గాలిలో తేమ వస్తుందని శనగ పంట నిలువలు దెబ్బతింటాయని ఇప్పుడు అప్పుడే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులను భయాందోళన గురి చేస్తున్నట్టు రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా ఈనెల 18 19 20 తేదీలలో తుఫాను ప్రభావం ఉన్నందున మార్క్ఫెడ్ ద్వారా కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అని ఆదుకోవాలని సెనగ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంట కోసి నెలనర రోజులు అవుతుంది
పంట కోసి నెలనర రోజులు అవుతుంది 4200కు పంట అడుగుతున్నారు ఇట్లా అమ్మితే మాకు ఏమి లాభం ఉంటుంది. ఇంత కష్టపడి పంట పండించి నా మమ్మల్ని ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి శనగ పంటను కొనుగోలు చేసి మమ్ములను ఆదుకోవాలి.
శనగ రైతు




