13 March, 2026 | 5:35 AM

ప్రశ్నార్థకంగా అడ్మినిస్ట్రేషన్?

13-03-2026 12:00 AM

రాజేంద్రనగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్‌లో 

ప్రభుత్వానిది ప్రగతిపై ప్రణాళిక

అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన ఎజెండా

  1. సెలవు పేరుతో కార్యాలయానికి వరుస డుమ్మాలు

రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం టౌన్ ప్లానింగ్‌లో ఓ ఉద్యోగి వింత పోకడ

ప్రతిరోజు సెలవు వారం రోజుల తర్వాత సంతకాలు

టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో బాధితుల పడిగాపులు

రాజేంద్రనగర్ మార్చి 12 (విజయ క్రాంతి) : ప్రభుత్వం పట్టణాలను గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు‘ 99 రోజుల ప్రగతి ప్రణాళిక‘ ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా పట్టణాల్లో జరగాల్సిన అభివృద్ధి జరిగిన అభివృద్ధిని సమీక్షించుకుంటూ ఎక్కడ కూడా పెండింగ్ పనులు లేకుండా అధికారులను అప్రమత్తం చేస్తూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని ప్రభుత్వం పక్కగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ జిహెచ్‌ఎంసి పరిధి లోని రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం టౌన్ ప్లానింగ్‌లో పనిచేసే ఓ అధికారి గత వారం రోజులుగా కార్యాలయానికి రావడం లేదు.

వివిధ పనుల కోసం ఎప్పుడు కార్యాలయానికి వెళ్లిన ఖాళీ కుర్చీ యే దర్శనమిస్తుందని వివిధ పనుల కోసం టౌన్ ప్లానింగ్ సెక్షన్కు వచ్చే ప్రజలు వాపోతున్నారు . బుధవారం వరకు సంబంధిత అధికారి సెలవులో ఉన్నాడని టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో పనిచేసే సిబ్బంది చెబుతున్నప్పటికీ గురువారం ఎందుకు కార్యాలనికి ఎందుకు రాలేదో మరి అందుకు సంబంధించిన సెలవు పేపర్ అందుబాటులో లేకపోవ డం విశేషం.

రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ వాటిని నిలువరించడంలో సంబంధిత అధికారి తన కు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాడు . దీంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడటంతో పాటు పూర్తిగా టౌన్ ప్లానింగ్ లో అడ్మినిస్ట్రేషన్ ప్రశ్నార్థకంగా మారింది.. గురువారం రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం కు కొంతమంది ప్రజలు వివిధ సమస్యలపై టౌన్ ప్లానింగ్ సెక్షన్ కు వచ్చారు రోడ్లు కబ్జా చేశారని. అనుమతులకు మించి భవన నిర్మాణాలు చేపడుతున్నారని.

కొత్త భవన నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో పాటు ఇతర సమస్యలతో టౌన్ ప్లానింగ్ సెక్షన్ కు వచ్చిన వారికి నిరాశే మిగిలింది.జవాబు దారి కలిగిన అధికారి ఎవరు లేకపోవడంతో నిరాశగా వెళ్లిపోయారు. కొం దరు అధికారులు కార్యాలయానికి రాకుండా ఫీల్‌కు వెళ్తున్నామని విధులకు డుమ్మాలు కొడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు అధికారులు సెలవు చీటీల పేరుతో కార్యాలయానికి రాకుండా వారం రోజుల తర్వాత అటెండెన్స్ రిజిస్టర్లలో సంతకాలు చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి . 

ఆ అధికారి ఆరు రోజులు సెలవులో ఉన్నాడు..

టౌన్ ప్లానింగ్ లో పనిచేసే ఓ అధికారి గత కొన్ని రోజులుగా కార్యాలయానికి రాకపోవడంపై జిహెచ్‌ఎంసి రాజేంద్రనగర్ సర్కిల్ డిసి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ గత ఆరు రోజుల నుండి అతను సెలవులో ఉన్నాడని తెలిపారు.

 సురేందర్ రెడ్డి