‘ఆరుద్ర’ సందడి.!
29-06-2026 12:16 AM
మహబూబాబాద్, విజయక్రాంతి : వానాకాలంలో ‘ఆరుద్ర’ కార్తెలో కనిపించే అరుదైన ‘ఆరుద్ర’ పురుగులు భూపాలపల్లి జిల్లాలో పలుచోట్ల కనిపించి సందడి చేశాయి. కేవలం ఆరుద్ర కార్తెలోనే ఇవి కనిపించడం ప్రత్యేకత. గులాబీ వర్ణంలో, మక్మల్ క్లాత్ మాదిరిగా, సుతి మెత్తగా ఉండే ఆరుద్ర పురుగులను పలువురు ఆసక్తిగా తిలకించారు.






