23 May, 2026 | 6:02 PM

TG POLYCET Results 2026.. ఒక్క క్లిక్‌తో పాలీసెట్ ఫలితాలు

23-05-2026 05:00 PM

హైదరాబాద్: తెలంగాణ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ (పాలిటెక్నిక్) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన TG Polycet 2026 ఫలితాలు(TG POLYCET Results 2026.) శనివారం విడుదలయ్యాయి. మొత్తం 82.94 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలుర ఉత్తీర్ణత శాతం 79.92 కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 86.38గా నమోదైంది. వరంగల్‌కు చెందిన నమల లోకేష్ మొదటి ర్యాంకును, సూర్యాపేటకు చెందిన బోనోతు హేమనాథ్ రెండో ర్యాంకును సాధించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబరు, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా తమ ఫలితాలను, ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పాలీసెట్  ఫలితాలు https://www.polycet.sbtet.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఒక్క క్లిక్‌తో పాలీసెట్ ఫలితాలు

https://www.polycet.sbtet.telangana.gov.in/#!/index