23 May, 2026 | 6:08 PM

ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశం

23-05-2026 05:13 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డా. బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం(Telangana Cabinet Meeting) ప్రారంభం అయింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రారంభించనున్న పలు అంశాలు, ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం, కొత్త పింఛన్ల పంపిణీపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 

జూన్ 2న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని(Indiramma Family Life Insurance Scheme) సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతపై చర్చించి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. సవరించిన భూముల మార్కెట్ విలువలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీసెస్ అధికారులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ, ధాన్యం సేకరణ, రైతుల ఇబ్బందులు, విపక్షాల విమర్శలపై ఈ కేబినెట్ భేటీలో సీఎం చర్చించనున్నారు.