6 May, 2026 | 4:42 PM

టీజీ20 లీగ్ నిబంధనలకు విరుద్ధం: టీసీఏ నిర్మల్ జిల్లా కోచ్ రామరాజు

06-05-2026 04:11 PM

నిర్మల్,(విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రకటించిన TG20 / ప్రీమియర్ లీగ్ ను తక్షణమే నిలిపివేయాలని, జిల్లా కన్వీనర్ రామరాజు తెలిపారు. HCA చేస్తున్న 'రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ' ప్రచారం పూర్తిగా అసత్యం. రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధి చేసేందుకు అవసరమైన జిల్లా స్థాయి నిర్మాణం, కమిటీలు, మౌలిక సదుపాయాలు, ఆటగాళ్ల నెట్వర్క్ లేదా వ్యవస్థ HCA వద్ద లేదు. అందుకే గత 80 సంవత్సరాలుగా HCA తెలంగాణ జిల్లాల్లో వాస్తవంగా ఏమీ చేయలేదు అని ,జిల్లా కోచ్ రామరాజు అన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా BCCI నిబంధనల ప్రకారం అవసరమైన పూర్తి నిర్మాణం (district committees, player registration system, tournaments, selections, coaching & match administration framework) ఏర్పాటు చేసి, గ్రాసూట్ క్రికెట్ వ్యవస్థను నిరంతరం నడుపుతున్న ఏకైక సంస్థ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) మాత్రమే అని రామరాజు చెప్పారు