కొనసాగుతున్న టీజీ-20 క్రికెట్ లీగ్ మోగా వేలం
హైదరాబాద్: తెలంగాణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ-20 క్రికెట్ లీగ్ మోగా వేలం ఆదివారం రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా కొనసాగుతుంది. క్రికెట్ ఆటగాళ్ల వేలంలో ఎనిమిది ఫ్రాంచైజీలు పాల్గొంటున్నాయి. ప్రముఖ వ్యాఖ్యాత చారు శర్మ అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ మెగా వేలానికి తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన 1300 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా 20 మంది క్రికెటర్లను ఎంచుకోనందని, ఆటగాళ్ల కొనుగోలుకు ఒక్కో జట్టు గరిష్ఠంగా రూ.60 లక్షలు వెచ్చించనుంది. ఒక్కో జట్టు కనీసం రూ.54 లక్షలు ఖర్చు చేయాలని నిబంధన, ఆటగాళ్లను ఏ ప్లస్, ఏ,బీ,సీ1, సీ2 విభాగాలుగా వర్గీకరణ చేశారు.
మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ ఈ వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీజీ-20 అరంగేట్ర సీజన్ ఈనెల 21న ప్రారంభం కానుంది. టీజీ-20 క్రికెట్ లీగ్ లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్, రంగారెడ్డి రైజర్స్, వరంగల్ వారియర్స్, మెదక్ ఫాల్కన్స్, అనురాగ్ నల్గొండ నైట్స్, కరీంనగర్ డైమండ్స్, పాలమూరు స్ట్రయికర్స్, అన్విత ఖమ్మం ఏసెస్ జట్లు పాల్గొంటున్నాయి.






