20 May, 2026 | 3:46 AM

టీజీ ఆగ్రోస్, టీజీ వేర్‌హౌసింగ్ ఎంఓయూ

20-05-2026 01:37 AM

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి) :  వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో టీజీ ఆగ్రోస్, టీజీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా 23 ఎకరాల ప్రభుత్వ భూమిలో టీజీ వేర్‌హౌజింగ్ కార్పొరేషన్ సొంత నిధులతో 85 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆధునిక గిడ్డంగులను నిర్మించనుంది. ఈ నిర్మాణ పనులను 15 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, రైతులు తమ పంట ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ చేసు కునేందుకు ఈ గిడ్డంగులు ఎంతో ఉప యోగపడతాయని తెలిపారు. అలాగే ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి రక్షించడంలో కూడా ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ మౌలిక వసతుల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులకు నిల్వ, మార్కెటింగ్ సదుపాయాలను మెరుగు పర్చేందుకు మరిన్ని చర్యలు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు.