13 August, 2026 | 11:00 AM

గుండె చికిత్సకు రూ.2 లక్షల ఎల్‌ఓసీ

13-08-2026 09:53 AM

వనపర్తి టౌన్: గుండె సంబంధిత అనారోగ్యంతో హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కుమ్మరి పెంటయ్య వైద్య ఖర్చుల కోసం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రూ.2 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించారు. పెంటయ్య చికిత్స విషయం కౌన్సిలర్‌ బొడ్డుపల్లి పరశురాం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఎల్‌ఓసీ మంజూరుకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ పరశురాం, బొడ్డుపల్లి రవి తదితరులు పెంటయ్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.