ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగను జరుపుకోవాలి
13-08-2026 08:56 AM
ఎస్ఐ మధు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఆగస్టు12: పల్లెల్లో సంస్కృతి,సాంప్రదాయాలకు నెలువైన బోనాల పండుగను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో,ఆనందోత్సాహాల మధ్య,ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అర్వపల్లి ఎస్ఐ పి మధు ఒక ప్రకటనలో కోరారు.బుధవారం ఆయన మాట్లాడుతూ మండలంలో గురువారం బోనాల పండుగ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.పండుగ సందర్భంగా గొడవలు సృషించడం,మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం,వేధించడం,మద్యం సేవించి అల్లరి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






