26 April, 2026 | 3:32 AM

ఇంఫాల్‌లో ఉద్రిక్తత

26-04-2026 12:53 AM

సీఎం నివాసం ముట్టడికి ఆందోళనకారుల యత్నం

వారికి, పోలీసుల మధ్య తోపులాట

ఇంఫాల్, ఏప్రిల్ 25: రాష్ట్రంలో శాంతిస్థాపనతో పాటు మరో ఆరు ప్రధాన డిమాండ్లతో శనివారం మణిపూర్ సమన్వయ కమిటీ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. ఈ క్రమంలో నిరసనకారులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన తోపులాట ఘర్షణకు దారితీసింది.

ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసు లు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. దీంతో కొందరు ఆందోళనకారులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ప్రత్యేక అం బులెన్సుల్లో సమీప ఆస్పత్రులకు తరలించా రు. ఈనెల 7న బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన రాకెట్ దాడిలో ఇద్దరు చిన్నారులు మరణించారు. అప్పటి నుంచి మణిపూర్‌లో పరిస్థితు లు నివురుగప్పిన నిప్పులా మారాయి. రాష్ట్రం లో ఎప్పుడు.. ఎక్కడ ఎలాంటి ఉద్రిక్తలు చోటుచేసుకుంటాయేమోనని రాష్ట్ర ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.