7 July, 2026 | 12:57 PM

Breaking News

డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం దగ్గర ఉద్రిక్తత   •   తృటిలో తప్పిన ప్రమాదం   •   భువనగిరి మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం సంతాపం   •   బాన్సువాడ పట్టణంలో డ్రైనేజీలపై ఉన్న దుకాణాల తొలగింపు   •   డ్రైనేజీలపై ఆక్రమణల తొలగింపుకు ప్రజలు సహకరించాలి   •   పొలమెళ్లిన ప్రాణం తిరిగిరాలేదు.. అనాథలైన భార్యాపిల్లలు   •   ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం   •   నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయి: మల్కాజిగిరి సీపీ సుమతి   •   మహారాష్ట్రలో వర్షబీభత్సం.. 24 గంటల్లో 67 సెం.మీ వాన   •  

అనవసరంగా వివాదంలోకి లాగారు

26-04-2026 12:51 AM

మాజీ జనరల్ నరవణె ఆవేదన

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: తన పుస్తకం ఇంకా పబ్లిష్ కాకపోయి నా తనను వివాదంలోకి లాగారంటూ భారత మాజీ సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె శనివారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై పరోక్షంగా విమర్శలు సంధించారు. నరవణె రచించిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’పై పలు ఆరోపణలు వస్తున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ద క్యూరియస్ అండ్ ద క్లాసిఫైడ్ అన్ ఎర్తింగ్ మిలిటరీ మిత్స్ అండ్ మిస్టరీస్’పై ఇటీవల విడుదలైన సందర్భంగా నరవణె పిటీఐతో మాట్లాడారు.

తాను రెండు పుస్తకాలు రాశాన ని వాటిలో ఒకటి విడుదలైందని ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ అనే పుస్తకాన్ని పూర్తిగా పరిశీలించేవరకు ప్రచురణను నిలిపివేయమని రక్షణ మంత్రిత్వ శాఖ కోరిందన్నారు. ఈ విషయం అక్కడితో ముగిసిపోయిందన్నారు. కానీ పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చిన కొందరు తనను కావాలనే వివాదంలోకి లాగారని ఆవేదన వ్యక్తంచేశారు. అది ఏ మాత్రం సమంజసం కాదన్నారు. రాహుల్‌గాంధీ లోక్‌సభకు తీసుకువెళ్లిన ఈ పుస్తకంలో చైనా దళాలతో భారత బలగాల ఘర్షణకు సంబంధించిన అంశాలను నరవణె ప్రస్తావించారు.