22 April, 2026 | 11:35 AM

Breaking News

TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె ప్రభావం.. డిపోకే పరిమితమైన బస్సులు   •   కాళేశ్వరం కేసులో KCR, Harishలకు భారీ ఊరట: హైకోర్టు సంచలన తీర్పు   •   పీసీ ఘోష్ కాళేశ్వరం నివేదికపై తుది తీర్పు   •   ఆర్టీసీ కార్మికుల సమ్మె— రోడ్డెక్కని బస్సులు   •   కామారెడ్డి బస్టాండ్‌లో ఉద్రిక్తత.. బస్సు గాలి తీసేసిన ఆర్టీసీ కార్మికులు   •   తెలంగాణలో ఆర్టీసీ సమ్మె— ప్రయాణికులకు తిప్పలు   •   సత్తుపల్లిలో హోరెత్తిన ఆర్టీసీ సమరభేరి: స్తంభించిన రవాణా వ్యవస్థ   •   కామారెడ్డి జిల్లాలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు   •   RTC Strike Today: డిపోల వద్ద సమ్మె.. వందల బస్సులు నిలిపివేత   •   ఆగిపోయిన ఆర్టీసీ రథచక్రం   •  

బీహార్ మహిళల ఖాతాల్లో 10వేలు

27-09-2025 01:40 AM
  1. ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన ప్రారంభం
  2. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని

పాట్నా, సెప్టెంబర్ 26: బీహార్‌లో మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ ఎన్డీయే ప్రభుత్వం ‘ముఖ్యమం త్రి మహిళా రోజ్‌గార్ యోజన’ పథకానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం పది వేల చొప్పున జమ చేసింది. ఈ పథకాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని కొందరు లబ్ధిదారులతో ము చ్చటించారు.

మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. ‘మహిళలకు అందించే ఈ సాయాన్ని క్రమక్రమంగా పెంచుతాం. రూ. 2 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తాం’ అని నితీశ్ ప్రకటించారు. ఇక ప్రధాని మో దీ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌పై పరోక్ష వి మర్శలు చేశారు. ఈ పథకానికి 3.06 కోట్ల దరఖాస్తు లు రాగా.. తొలి దశలో 75 లక్షల మందిని ఎంపిక చేసినట్టు ఉపముఖ్యమంత్రి సామ్రాట్‌చౌదరి తెలిపారు.