4 June, 2026 | 11:19 PM

Muzaffarpur Hospital Fire: ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది దుర్మరణం

04-06-2026 10:54 AM

పాట్నా: బిహార్ ముజఫర్ లోని ప్రసాద్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది రోగులు మృతి చెందగా, మరో పది మందిని సహాయక సిబ్బంది కాపాడారు. ఆస్పత్రి ఐదో అంతస్తుల్లోని ఐసీయూలో(Intensive Care Unit) ఈ ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని ముజఫర్ పూర్ జిల్లా కలెక్టర్ సుబ్రత్ కుమార్ వెల్లడించారు. దేశరాజదాని ఢిల్లీ నిన్న ఒక ఓటల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగి 21 మంది సజీవదహనం అయ్యారు.