14 March, 2026 | 6:30 AM

నేటి నుంచి ‘పది’ పరీక్షలు

14-03-2026 12:00 AM

జిల్లాలో 255 పరీక్ష కేంద్రాలు

జిల్లా వ్యాప్తంగా పకడ్బందీ ఏర్పాట్లు

రంగారెడ్డి, మార్చి 13 (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా పదో తరగతి ప్రభుత్వ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పర్యవేక్షణలో, జిల్లా విద్యాశాఖాధికారి  ఆధ్వర్యంలో పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 1,024 ఉన్నత పాఠశాలల నుండి 53,050 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో గతంలో ఉత్తీర్ణత సాధించని 1,108 మంది విద్యార్థులు కూడా ఉన్నారు.

మొత్తం 255 కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో 11 ప్రైవేట్ కేంద్రాలు ఉన్నాయి. పరీక్ష కేంద్రాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ’A’ కేటగిరీలో 45, ’B’ కేటగిరీలో 202, మరియు ’C’ కేటగిరీలో 07 కేంద్రాలు ఉన్నాయి. పరీక్ష ఉదయం 9:30 నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12:30 వరకు. ప్రశ్నపత్రాల భద్రత కోసం జిల్లాలోని 37 పోలీస్ స్టేషన్లను స్టోరేజ్ పాయింట్లుగా వినియోగిస్తున్నారు. పరీక్షల సమయంలో ఎటువంటి అక్రమాలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా 10 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించారు. అంతేకాకుండా, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలని విద్యాశాఖ సూచించింది.