16 April, 2026 | 12:23 PM

ఆలయంలో హుండీ చోరీ

16-04-2026 10:41 AM

25తులాల వెండి, 30వేలు ఎత్తుకెళ్లిన దొంగ 

కంగ్టి (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం లోని మంచమహల్ దమర్గిద్ద గ్రామంలో వెంకటేశ్వర ఆలయంలో చోరి జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం వెంకటేశ్వర ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తి మాస్క్ ధరించి ఆలయంలోకి వెళ్లి హుండీని పగులగొట్టాడు. హుండీలో ఉన్న 25తులాల వెండి, 30వేల రూపాయలు అపహారించినట్టు గ్రామస్తులు తెలిపారు.చోరి జరిగిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.ఈ ఘటనపై ఎస్ఐ దుర్గారెడ్డి ని వివరణ కోరగా పిర్యాదు అందలేదాన్నరు.పిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.