ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం
16-04-2026 11:29 AM
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు(Special Parliament session) గురువారం ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఇవాళ్టి నుంచి మూడురోజులపాటు కొనసాగనున్నాయి. ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్ సభ సంతాపం తెలిపింది. లోక్‌సభలో మాజీ సభ్యుల మరణంపై లోక్‌సభ స్పీకర్ సంతాపం తెలిపారు. దిగ్గజ గాయని ఆశా భోస్లే(Asha Bhosle) ఏప్రిల్ 12న కన్నుమూసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్‌లో మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది. 3 బిల్లులపై చర్చ కోసం లోక్‌సభలో 18 గంటలు, రాజ్యసభలో 10 గంటలు కేటాయించారు.






