25 February, 2026 | 5:51 AM

తెలుగమ్మాయిల జోరు

25-02-2026 12:00 AM

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్

దుబాయి, ఫిబ్రవరి 24: ఆసీస్ గడ్డపై టీ20 సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దుమ్మురేపారు. తెలుగమ్మాయిలు అరుంధతి రెడ్డి, శ్రీచరణి బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ సాధించారు. తాజాగా విడుదలైన జాబితాలో అరుంధతి రెడ్డి ఐదు స్థానాలు ఎగబాకి 11వ ర్యాంకులో నిలిచింది. ఈ హైదరాబాదీ క్రికెటర్ 3 మ్యాచ్‌లలో 8 వికెట్లు పడగొట్టింది.

దీప్తి శర్మ, రేణుకా సింగ్ తర్వాత భారత్ తరపున అత్యుత్తమ ర్యాంక్ అరుంధతిదే. ఆసీస్‌పై తొలి టీ ట్వంటీలో అరుంధతి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచింది. 22 పరుగులే 4 వికెట్లు పడగొట్టింది. దీప్తిశర్మ 4, రేణుక ఆరో ర్యాం కులో ఉన్నారు. అలాగే మరో తెలుగమ్మాయి శ్రీచరణి కూడా బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకం గా 11 స్థానాలు ఎగబాకి 26వ స్థానానికి దూ సుకొచ్చింది.

ఆసీస్‌లో సిరీస్‌లో ఆమె 5 వికె ట్లు పడగొట్టింది. మరోవైపు బ్యాటింగ్ ర్యాం కింగ్స్ టాప్ 10లో ముగ్గురు భారత క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. స్మృతి మంధాన 3, షెఫాలీ వర్మ 6, జెమీమా రోడ్రిగ్స్ 10వ స్థానంలో నిలిచారు. ఇక ఆల్‌రౌండర్ రాంకిం గ్స్ టాప్ 10లో దీప్తి శర్మకు మాత్రమే చోటు దక్కింది.