మెరిసిన తెలంగాణ స్విమ్మర్లు
20-08-2026 01:07 AM
జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ చాంపియన్ షిప్
సుహాస్ ప్రీతమ్‌కు స్వర్ణం
భువనేశ్వర్, ఆగస్టు 19: 52వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్ షిప్ 2026లో తెలంగాణ స్విమ్మర్స్ అదరగొట్టారు. బుధవారం పోటీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు, 1 స్వర్ణం, 1 రజతం, 2 కాంస్య పతకాలు సాధించారు. 100 మీట ర్ల బ్యాక్ స్ట్రోక్‌లో సుహాస్ ప్రీతమ్ మైలారి బంగారు పతకం గెలుచుకోగా, శ్రీ నిత్య సాగి రెండు పతకాలు గెలిచింది.
అన్నికా డెబోరా కాంస్య పతకం గెలిచింది. ఈ స్విమ్మర్లు జాతీయ ఛాంపియన్ షిప్‌లో తెలంగాణ రాష్ట్రానికి గర్వంగా నిలిచారని స్పోరట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రశంసించాయి. వారి విజయాలు ,వారి అంకితభావం, క్రమశిక్షణతో కూడిన దీనికి నిదర్శనమని కొనియాడారు.






