12 March, 2026 | 11:05 AM

ఫిరాయింపులకు తెలంగాణ ప్రయోగశాల

12-03-2026 01:59 AM

రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): తెలంగాణను పార్టీ ఫిరాయింపులకు ఒక ప్రయోగశాలగా మార్చారని, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని బీజేపీ రాజ్యసభసభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. విచారణ పేరుతో కాలం వెళ్లబుచ్చి క్లీన్ చిట్ ఇవ్వడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. స్వయంగా కండువాలు కప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు నోరు మెదపకపోవడం దారుణమన్నారు.

నైతిక విలువలకు, ప్రజా తీర్పునకు గౌరవం ఇచ్చే ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్క సీటుతో ప్రభుత్వాన్ని కోల్పోతామని తెలిసి కూడా ఫిరాయింపులను అప్పటి ప్రధాని వాజ్ పేయి ప్రోత్సహించలేదని గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని ఎప్పుడూ కాపాడాలని చెప్పే రాహుల్‌గాంధీ.. ఇప్పుడు జవాబు చెప్పాలని ప్రశ్నించారు. 

ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన స్పీకర్ ఇలా మచ్చ తెచ్చేలా వ్యవహరించడం దారుణమని దుయ్యబట్టారు. తెలంగాణలో అంబేద్క ర్ రాజ్యాంగం అమలు కావడంలేదని, రేవంత్‌రెడ్డి రాజ్యాంగం అమల వుతోందని విమర్శించారు. ఫిరాయింపుల విషయంలో ఒకరిని మించి ఒకరు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వ్యవహరిస్తున్నాయని ఆగ్ర హించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమ వంతు న్యాయ పోరాటం చేస్తామని లక్ష్మణ్ స్పష్టం చేశారు.