20 May, 2026 | 5:43 PM

ఆమాత్యుల రాకకు నిరీక్షణ

20-05-2026 04:17 PM

... ఎండలో ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు 

... గంట ఆలస్యంగా వచ్చిన మంత్రులు 

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ రెండున జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బుధవారం రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన అధికారులు ఇచ్చిన షెడ్యూల్ రెండు గంటలకి రావాల్సి ఉండగా 2.50 కి రావడంతో మంత్రుల రాక కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులకు ఎదురుచూపులు తప్పలేదు. విపరీతమైన వేడిగాలులతోపాటు తీవ్ర ఎండలు కొట్టుతున్న సమయంలో మంత్రుల పర్యటన జిల్లా యంత్రాంగానికి పరీక్షగా మారింది.

ప్రభుత్వ యంత్రాంగం వేసవి నేపథ్యంలో ప్రజలు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని  సూచిస్తున్నప్పటికీ మంత్రులు మాత్రం పట్టపగలే పర్యటించడం గమర్హనం.మంత్రులు పర్యటనతో పోలీస్ సిబ్బంది,ఫైర్ సిబ్బంది,ఇతర ప్రభుత్వ ఉద్యోగులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.ఇది ఇలా ఉండగా మంత్రులకు మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీనాయకులు కార్యకర్తలకు సైతం భానుడి భగభగలో నిరీక్షించక తప్పలేదు.