calender_icon.png 17 February, 2026 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనురాగ్ యూనివర్సిటీలో తేజస్ 2కె26–ది ప్రాజెక్ట్ ఎక్స్‌పో ప్రారంభం

17-02-2026 01:51:18 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీలో రెండు రోజులు జరుగనున్న తేజస్ 2కె26–ది ప్రాజెక్ట్ ఎక్స్‌పో ను  ప్రారంభించారు. ఇది విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధన దృక్పథం, భవిష్యత్‌ కు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు రూపొందించిన విశ్వవిద్యాలయ ప్రధాన ఆవిష్కరణ కార్యక్రమం అని తెలిపారు. మొత్తం 150కి పైగా ప్రాజెక్టులు వ్యవసాయ సాంకేతికత, కృత్రిమ మేధస్సు, శుభ్రమైన శక్తి విద్యా సాంకేతికత నూతన సాంకేతికతలు హెల్త్ టెక్ ఐఓటి అంతరిక్ష సాంకేతికత వంటి రంగాల్లో ప్రవేశింపబడ్డాయి.ఈ కార్యక్రమానికి అతిథులుగా దయానంద్ రెడ్డి, వసంత గ్రూప్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ దయానంద్ రెడ్డి, 

హెడ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ వీర చెప్పి (ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ లిమిటెడ్, ఆసియా) డైరెక్టర్ ఆపరేషన్స్, అపోలో మైక్రో సిస్టమ్స్ వడ్డేపల్లి కృష్ణ సాయికుమార్, హెడ్–గవర్నమెంట్ ఇన్నోవేషన్ పార్ట్‌నర్‌షిప్స్, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ప్రణయ్ నల్ల, లీడ్ టెక్నికల్ ట్రైనింగ్, ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రవీణ్ కుమార్ వజ్జా, వైస్ ప్రెసిడెంట్, అవ్రి రోబోటిక్స్ సంజయ్ కుమార్ గజ్జాల, ఏఐ నిపుణుడు, ఇన్నోవేషన్ ఎవాంజలిస్ట్, ఇన్వెస్టర్ (యుఎస్) డాక్టర్ రాజేంద్రప్రసాద్, ప్రొడక్ట్, స్ట్రాటజీ లీడ్, బ్రాడ్‌రిడ్జ్ అభినవ్ గుప్తా లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  హైవ్ లోగో ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అర్చన మంత్రి, సి.ఈ. ఓ.  ఎస్. నీలిమ, డీన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డాక్టర్ వి. విజయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ స్ట్రేటెజీ పల్లా అనురాగ్, అసోసియేట్ డీన్ డాక్టర్ కె.శ్రీనివాస చలపతి, ఇన్నోవేషన్ డైరక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి, అడ్వైసర్ డాక్టర్ శాంత తదితరులు పాల్గొన్నారు. ఈఎక్స్‌పోకు ప్రముఖ విద్యాసంస్థల విద్యార్థులు, అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులు  సాంకేతిక అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.