ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. 126 మందికి తప్పిన ప్రమాదం
30-05-2026 12:28 PM
హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Rajiv Gandhi International Airport)లో శనివారం నాడు బెంగళూరు-నాగ్‌పూర్ ఇండిగో విమానం(Bengaluru-Nagpur Indigo flight) అత్యవసర ల్యాండింగ్ అయింది. ఇండిగో విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ RGIA అధికారులకు సమాచారం అందించగా వారు అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతించారు. ఆ సమయంలో విమానంలో 126 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.






