సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్
హైదరాబాద్: సంధ్య 70 ఎంఎం థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన కేసును నాంపల్లి కోర్టు సోమవారం జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. సంధ్య థియేటర్ కేసులో నిందితులు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. అర్జున్‌తో సహా నిందితులందరూ కోర్టుకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. కోర్టుకు హాజరైన నిందితులు జడ్జి ముందు బాండ్లపై సంతకాలు చేశారు. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్(Allu Arjun) ముంబైలో షూటింగ్ కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరినట్లు సమాచారం.
ఆయన తరఫున వాదిస్తున్న న్యాయవాది, అల్లు అర్జున్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చి, వర్చువల్ విధానంలో హాజరయ్యేందుకు అనుమతించాలని కోరుతూ కోర్టులో(Nampally court) పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ హాజరుకానందున మెమో దాఖలు చేయాలని కోర్టు సూచించించింది. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో(Sandhya Theatre stampede case) ఒక మహిళ మరణించగా, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.
చిక్కడపల్లి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, 2025 డిసెంబర్ చివరి వారంలో నిందితులపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఆ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, ఛార్జ్‌షీట్‌లో థియేటర్ యజమాని, భాగస్వాములు, మేనేజర్, లోయర్ బాల్కనీ ఇన్‌ఛార్జ్, గేట్‌కీపర్‌లను 1 నుండి 10 వరకు నిందితులుగా పేర్కొన్నారు. 'పుష్ప 2' ప్రీమియర్ ప్రదర్శన(Pushpa 2 Stampede Case) సందర్భంగా అల్లు అర్జున్ ని చూసేందుకు అభిమానులు గుమిగూడినప్పుడు ఈ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన తర్వాత, మరణించిన మహిళ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, ఆయన భద్రతా సిబ్బంది, థియేటర్ యాజమాన్యంపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఒక రోజు జైల్లో ఉండి, ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే.






