ఎర్రరాయి అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్ పోలీసుల పంజా
27-02-2026 08:04 PM
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం తట్టేపల్లి వైపు నుండి అనుమతులు ఏవీ లేకుండా ఎర్ర రాయిని తరలిస్తున్న ట్రాక్టర్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అడ్డుకొని కేసు నమోదు చేశారు. ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం... ఎర్రరాయిని రవాణా చేస్తున్న టీఎస్ 34 టి7089 నంబర్ గల ట్రాక్టర్ డ్రైవర్ దొడ్ల భీమయ్యను విచారించగా అనుమతి పత్రాలు ఏవి లేకపోవడంతో కేసు నమోదు చేసి తాసిల్దార్ వెంకటేష్ ప్రసాద్ వద్ద బైండ్ ఓవర్ చేయగా తాసిల్దారు రూ.5000 జరిమానా విధించారని తెలిపారు.




