30 May, 2026 | 4:34 AM

టార్గెట్ కోత.. రైతులకు వాత

30-05-2026 12:36 AM
  1. చివరి గింజ వరకూ కొనడం ఇదేనా?
  2. రైతుల గోసపై ప్రజాప్రభుత్వం అబద్ధాలతో దాడి
  3. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): కొనుగోళ్ల టార్గెట్‌కు ప్రజాప్రభుత్వం కోత పెట్టి.. రైతులకు వాతపెడుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చివరి గింజ వరకూ కొనడం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. రైతుల గోస పై కాంగ్రెస్ సర్కారు అబద్ధాలతో దాడిచేస్తోందని ఆగ్రహించారు. ఒకవైపు ధర్నాలు చేస్తుంటే ధాన్యం కొనుగోళ్లు సజావుగా సా గుతున్నాయనడం సిగ్గుచేటన్నారు.

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం అంటూనే మీరు పెట్టుకున్న టార్గెట్‌ను మీరే తగ్గించడం రైతులను మోసం చేయడం కాదా? అని మాజీ మంత్రి హరీష్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని 90 లక్షల టన్నుల నుంచి 75 లక్షల మెట్రిక్ టన్నులకు సైలెంట్‌గా తగ్గించిన మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరికొన్ని రోజుల్లో ఏకంగా కొనుగోళ్లు పూర్తయ్యాయని ప్రకటిస్తారేమో! అని ఎద్దేవా చేశారు.

ఒకవైపు కోటి 41 లక్షల టన్నుల పంట పండిందని గొప్ప లు చెబుతూ మరోవైపు కొనుగోలు మాత్రం 75 లక్షల టన్నులకే పరిమితం అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేస్తున్నామని చెప్పే ముందు 2020 యాసంగిలో బీఆర్‌ఎస్ ప్ర భుత్వం 92.39 లక్షల టన్ను ల ధాన్యం కొనుగోలు చేసి, దేశ చరిత్రలోనే సరికొత్త రికా ర్డు సృష్టించిన విషయం గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.

ధాన్యం కొనుగోళ్లలో పూర్తిగా విఫలమై రైతుల గోసను కప్పి పు చ్చేందుకు మీరు చేస్తున్న అబద్ధాల ప్రచారం దుర్మార్గమని మండిపడ్డారు. ఒకవైపు రైతులు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తుంటే మరోవైపు కొనుగోళ్లు సజావుగా సాగుతున్నా యని చెప్పడం సిగ్గుచేటు అని విమర్శించారు.

‘వరి కుప్పల వద్ద రైతులు ప్రాణాలు కోల్పోయింది అబద్ధమా?, కొనుగోలు కేం ద్రాల్లో రోజులు తరబడి రైతులు పడిగాపులు కాచింది అబద్ధమా?, తడిసిన ధాన్యం తో రైతులు నష్టపోయింది అబద్ధమా?, నెల ల తరబడి కొనుగోళ్లు ఆలస్యం చేసింది అబద్ధమా?, డబ్బులు ఆలస్యంగా చెల్లించి రైతు లను అప్పుల పాలుచేసింది అబద్ధమా?’ అని ప్రశ్నించారు.

హైదరాబాద్‌లోని ఏసీ గదుల్లో కూర్చొని ప్రసంగాలు దంచితే రైతుల గోడు తీరదని, కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులు పడుతున్న కష్టాలు చూ డండి. వాళ్ల కన్నీళ్లు తుడవండి అని సూచించారు. మాటలు కట్టిపెట్టి, కొనుగోళ్ల ప్రక్రియ ను వేగవంతంగా పూర్తి చేయాలని, టార్గెట్లు పక్కన పెట్టి చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.