జగ్గయ్యపల్లి పంచాయతీ రికార్డుల తారుమారు
- సీజ్ చేసిన స్థానంలో కొత్తవి
- తూతూ మంత్రంగా విచారణ
- అనుమానం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
- కార్యదర్శిపై రెచ్చిపోయిన డీఎల్పీఓ
మానకొండూరు, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని జగ్గయ్యపల్లి గ్రామ పంచాయతీ 2019 మధ్య పాలకవర్గ హయాం లోని రికార్డులు తారుమారైనట్లుగా గ్రామస్తు లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.గత పాలకవర్గం హయాంలో పంచాయతీలో అవినీతి, అవకతవకలు జరిగాయని గతంలో అధికారులకు ఫిర్యాదులు అందాయి.
దీంతో కరీంనగర్ డీఎల్పీవో గత 25 రోజుల క్రితం జగ్గయ్యపల్లి గ్రామ పంచాయతీకి చేరుకుని విచారణ జరిపి రికార్డులు సీజ్ చేసి తీసుకెళ్లారు.శుక్రవారం డీఎల్పీవో గ్రామ పంచాయతీకి చేరుకుని విచారణ పూర్తి అయిందని, ఆ నివేదికను గ్రామస్తుల సమక్షంలో చదివి వినిపించారు. అనంతరం సీజ్ చేసిన రికార్డులను డీఎల్పీవో ప్రస్తుత పంచాయతీ కార్యదర్శికి అప్పగిస్తుండగా రికార్డులు కొత్తగా కనిపించడంతో అను మానం వచ్చింది.
సీజ్ చేసినవి పాత రికార్డులైతే కొత్త రికార్డులు ఎలా వచ్చాయంటూ సర్పంచ్ పాకాల వందన, పంచాయతీ కార్యదర్శి కవిత రికార్డులు తీసుకునేందుకు నిరా కరించారు. ఎంబీ రికార్డు, వోచర్స్, బిల్స్ సీజ్ చేసిన రికార్డుల్లో ప్రత్యక్షమయ్యాయి. రికార్డులు తారుమారవడంపై డీఎల్పీవోను గ్రామ స్తులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానా లు చెప్పారు.దీంతో గ్రామస్తులు డీఎల్పీవో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రికార్డులు తీసుకునేందుకు నిరాకరించిన పంచాయతీ కార్యదర్శిపై డీఎల్పీవో రెచ్చిపోయి చిందులు వేశారు.మహిళా కార్యదర్శి అని కూడా చూడకుండా డీఎల్పీవో ఇష్టారీతిన రెచ్చిపోయి పరు ష పదజాలం వాడారు.అధికారి తీరుపై గ్రామస్తులు మండిపడుతూ కారులో వెళ్తుండగా నిరసిస్తూ పంచాయతీ కార్యదర్శి డీఎల్పీవో కారును అడ్డుకుని నిరసన తెలిపారు.






