27 March, 2026 | 12:05 AM

విశాఖ ఆర్కే బీచ్‌లో ఎత్తైన ఇసుక బకెట్‌

26-03-2026 09:44 PM

విశాఖపట్నం, మార్చి 26 ఃవిశాఖపట్నంలోని ఆర్కే బీచ్ అంటేనే ఎన్నెన్నో విశేషాలు- ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు, ఉదయపు నడకలు, సాయంత్రపు విహారాలు, అప్పుడప్పుడు కనిపించే ఇసుక కోటల సమాహారం.కానీ ఈ వారం, ఇసుకతో భారీ పరిమాణంలో కేఎఫ్‌సీ బకెట్ ఒకటి ఆవిర్భవించడంతో బీచ్‌కు వచ్చినవారు ఆశ్చర్యానికి లోనయ్యారు. స్థానిక స్యాండ్ ఆర్టిస్ట్ ఆకునూరు బాలాజీ వరప్రసాద్ కేవలం బీచ్ ఇసుకను మాత్రమే ఉపయోగించి, 48 గంటల పాటు శ్రమించి దీన్ని రూపొందించారు.

ఈ అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించేందుకు 7టన్నులకు పైగా ఇసుకను వినియోగించారు. ఈ కళాఖండం ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన బ్రాండ్ చిహ్నాలలో ఒకటిగా మార్చింది. ఆకునూరు బాలాజీ వరప్రసాద్ శిల్పి మరియు ఒక ప్రఖ్యాత స్యాండ్ ఆర్టిస్ట్. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని పేరుపాలెం, మంగినపూడి, బాపట్ల బీచ్‌లతో పాటు భారతదేశంలోని పలు బీచ్‌లలో 700కు పైగా ఇసుక శిల్పాలను రూపొందించారు.

ఆయన కోనార్క్ అంతర్జాతీయ ఇసుక కళా ఉత్సవంలో నాలుగుసార్లు విజేతగా నిలిచారు. ఖతార్, యూరప్‌లలో నిర్వహించిన అంతర్జాతీయ స్యాండ్ ఆర్ట్ పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. బీచ్ రోడ్‌లో కేఎఫ్‌సీ తన సరికొత్త రెస్టారెంట్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈ శిల్పాన్ని రూపొందించారు. దీనితో విశాఖపట్నంలోని ఈ సుపరిచితమైన ప్రదేశం ఒక ఆకర్షణీయమైన ఫోటో స్పాట్‌గా మారింది. అలల ఒడ్డున విహరించిన తర్వాత, బీచ్‌కు వెళ్లేవారు తమకు ఇష్టమైన  కేఎఫ్‌సీ వంటకాలను ఆరగించేందుకు ఈ కొత్త రెస్టారెంట్ చక్కని వేదకగా నిలుస్తుందని కంపెనీ తెలిపింది.