మురుగు నీటిని నిల్వ ఉంచకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి
చాకలి కుంట చెరువులో మస్కిటో లార్వి సైడ్ బాల్స్ విడుదల.
కీసర డిప్యూటీ కమిషనర్ ఎన్ వసంత.
జవహర్ నగర్,(విజయక్రాంతి): కాలనీలు ఖాళీ ప్రదేశాలలో.... మురుగునీటిని నిల్వ ఉంచకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే... దోమల వ్యాప్తిని నివారించవచ్చునని కీసర డిప్యూటీ కమిషనర్ ఎన్. వసంత తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు కీసర డిప్యూటీ కమిషనర్ వసంత గురువారం ఎంటమాలజీ విభాగం పనితీరును అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీసర డివిజన్ చాకలికుంట చెరువులో దోమ లార్వా అభివృద్ధి చెందకుండా మస్కిటో లార్వి సైడ్ ఆయిల్ బాల్స్ ను విడుదల చేశారు. అలాగే స్నేహ కాలనీలో ఇంటింటికి దోమల నివారణకు మందును పిచికారి చేయించారు.
ఈ సందర్భంగా ఆమె వివరిస్తూ దోమ మనుషులను కరిచినప్పుడు అవి మనుషులతో చేరి వారి లివర్లో విభజన చెంది తదనంతరం ఎర్ర రక్త కణాలను నాశనం చేస్తాయని ఎర్ర రక్తకణాలలో చేరిన 48 నుండి 72 గంటలలో ఈ పరాన్ని జీవులు విభజన చెందిపోతాయన్నారు. దీనివలనూర్ జ్వరం వణుకుడితో కూడిన జ్వరం అసాధారణ రక్తస్రావం దీర్ఘస్వాస రక్తలేమి చిహ్నాలు స్పృహ కోల్పోవడం జరుగుతుందన్నారు. చలి జ్వరము తలనొప్పి కండరాల నొప్పి, చాతిలో నొప్పిగా ఉండడం దగ్గు చెమటలు పట్టడం వాంతులు విరేచనాలు నీరసంగా ఉండడం ఆయాసం మొదలైన మలేరియా లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ప్రారంభ దశలోన ఈ వ్యాధిని గుర్తించడం వల్ల మెరుగైన చికిత్స అందించవచ్చు అని తెలిపారు.
దోమ కాటుకు గురైన 7 నుండి 18 రోజుల మధ్య ఈ లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. రక్త నమూనాలను సేకరించి మైక్రోస్కోపిక్ లాబరేటరీ టెస్టులు లేదా ఆర్టీసీ టెస్టుల ద్వారా మలేరియా వ్యాధిని నిర్ధారిస్తారని తెలిపారు. అందువలన దోమల వ్యాప్తిని అరికట్టడం ద్వారా ఈ వ్యాధిని నిర్మూలించవచ్చునని తెలిపారు. అనంతరం ఎంటమాలజీ సిబ్బందికి కీసర డివిజన్లో దోమల నివారణకు ఎప్పటికప్పుడు విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఈలు భాస్కర్, తిరుపతి, రాజు, శ్రీనివాస్, స్వామి, ఎంటమాలజీ సిబ్బంది పాల్గొన్నారు.






