సోలార్ విద్యుత్ సద్వినియోగం చేసుకోండి
25-03-2026 06:45 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సబ్సిడీ ద్వారా అందిస్తున్న సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని ఉచిత విద్యుత్తు వాడుకుంటూ తద్వారా ఉత్పత్తి అయ్యే అదనపు విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యూనిట్ కి ఐదు రూపాయలు ఐదు పైసలు చొప్పున వినియోగదారుడు ఖాతాలో అందిస్తుంది.
సబ్సిడీ ద్వారా వినియోగదానికి రూ.78000/- బ్యాంకు ఖాతాలోకి జమ అవుతుంది అని సెవెన్ స్టార్ సోలార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధి ఎండి అఫ్జల్ అన్నారు. బుధవారం సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వాకర్ అసోసియేషన్ సభ్యులకు అవగాహన కల్పించారు.




