calender_icon.png 7 February, 2026 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెక్రటరీపై చర్యలు తీసుకోండి

07-02-2026 12:04:34 AM

డీపీఓ సురేష్ మోహన్ కు ఫిర్యాదు చేసిన బండరావిరాల గ్రామ సర్పంచ్  కందికంటి విజయ్ కుమార్ 

అబ్దుల్లాపూర్ మెట్, ఫిబ్రవరి 6: నిబంధనలను పాటించని గ్రామపంచాయతీ సెక్రటరీ పీ. నవనీత రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కందికంటి విజయకుమార్ అన్నారు. బండ రావిరాల గ్రామ పంచాయతీ సెక్రటరీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. రాజకీయ పక్షపాతంతో పనిచేస్తున్న నవనీత రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని శుక్రవారం డీపీఓ సురేష్ మోహన్ కు ఫిర్యాదు చేశారు.

అనంతరం సర్పంచ్ కందికంటి విజయకుమార్ మాట్లాడుతూ...  గ్రామసభ తీర్మానం లేకుండా, ప్రజల అభిప్రాయాలను స్వీకరించకుండ, అలానే గత డిసెంబర్ లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ, ఎన్నికల నిబంధనలను పాటించకుండానే శ్రీ ఉమా మహేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేయడానికి ఇచ్చి సహకరించిన సెక్రటరీ పై సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే దేవాదాయ శాఖ నుంచి వచ్చిన అభ్యంతరాల నోటీసులపై సంతకం చేసి... గత నెల రోజులుగా ఆ విషయాన్ని నూతన పాలకవర్గానికి సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి.. మోసపూరితంగా వ్యవహరించిన గ్రామ సెక్రెటరీ పై వెంటనే విచారణ చేపట్టాలని డీపీఓను కోరినట్లు తెలిపారు. దళితున్ని అయిన నేను సర్పంచ్ అయినందుకే సహకరించకుండా, రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వ అధికారిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. 

డీపీఓ సురేష్ మోహన్ సానుకూలంగా స్పందించినట్లువిజయ్ కుమార్ తెలిపారు. సెక్రెటరీ వ్యవహారంపై సమగ్ర విచారణ చేసిన తర్వాత... ఆమెపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దూస శంకర్, వార్డు సభ్యులు గుండ్ల భవాని-శివ, కన్నె భరత్, ఎడవల్లి సుష్మిత రాము గుప్తా, ఏర్పుల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.