అచ్చంపేట సంతకు ఆదాయం 5.2 శాతమే!
సిండికేట్‌గా సంత వేలం.. తగ్గిన ఆదాయం.
గతేడాది సంత వేలం 37.04 లక్షలు.. ఈ సారి రూ. 39.01 లక్షలు
తైబజార్ వేలం రూ. 10.99 లక్షలు
అచ్చంపేట, మార్చి 24: అచ్చంపేట ము న్సిపాలిటీ ప్రధానమైన ఆదాయ వనరుల్లో పశువు, మేకల సంత, తైబజార్ వేలం అత్యం త ముఖ్యమైనవీ. అంతటి ప్రాధాన్యత కలిగిన వాటిని కొంత మంది ముందే సిండి కేటుగా మారి కారుచౌకగా దక్కించుకున్నారు. దీనికి ఓ ప్రజాప్రతినిధి సహకరించా డనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మున్సిపల్ ఆదాయానికి భారీగా గండిపడినట్లైంది. కాగా మున్సిపాలిటీకి వచ్చే ఆస్తి, ఇంటి ప న్ను, ఆదాయం కేవలం సిబ్బంది వేతనాలు, కార్యాలయ నిర్వాహణకే సరిపోతోందని అనేక మార్లు అధికారులు చెప్పిన సమాదానం.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పురపాలక సంఘం పరిధిలో 202627 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తై-బజా ర్, పశువులు, మేకలు, గొర్రెల సంత నిర్వాహణ, తైబజార్, చికెన్ వ్యర్థాల సేకరణకు మంగళవారం టెండర్ వేలం నిర్వహించా రు. మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసు లు అధ్యక్షతన నిర్వహించారు. కమిషనర్ మురళి, మేనేజర్ రమేశ్ నాయక్ సంత, తైబజార్ నిర్వాహణ విధి విధానాలు, ఇతర అం శాలను చదివి వినిపించారు.
సంత వేలం రూ. 39.01 లక్షలు
పశువు, గొర్రె, మేకల సంతకు నిర్వహించిన టెండర్ వేలంలో అయిదుగురు పాల్గొన్నారు. వేలాన్ని అచ్చంపేటకు చెందిన జగ్జీవన్ రావ్ రూ.39,01,000లకు దక్కించుకున్నారు. గతేడాది ఇదే వేలం రూ. 37. 04,816 పలికింది. కానీ ఈ సారి నిర్వహించిన వేలంలో కేవలం అధనంగా 5.02 శా తం అంటే.. రూ. 1.96 లక్షలు ఆదాయం వ చ్చింది. వేలంలో పాల్గొన్న వ్యక్తులు ముందుగానే సిండికేటుగా మారారు.
ఈ వేలంలో ఓ ప్రజాప్రతినిధి సైతం భాగస్వామిగా ఉండటంతో అందరు కలిసి సిండికేటుగా మారి టెండర్ వేలంలో పాల్గొన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. పైగా గతేడాది పోలిస్తే మేకలు, గొ ర్రెలు నుంచి వసూళు చేసే రుసుమును భా రీగా పెంచారు. దీని వలన టెండర్ దక్కించుకున్న గుత్తేదారునికే లాభం చేకూరనుండగా.. మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం మాత్రం పెద్దగా పెరిగిందేమీ లేదు. అలాగే తైబజార్ నిర్వాహణను వేలంలో తొంబర్ల శ్రీనువాసులు రూ. 10.99 లక్షలకు దక్కించుకు న్నారు. సరైన దరఖాస్తులు రానందునా చికన్ వ్యర్థాల వేలాన్ని వాయిదా వేశారు.
నిబంధనలు మీరితే రద్దు: ఛైర్మన్
ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు సంత, తైబజార్ నిర్వాహణ చేపట్టాలని మున్సిపల్ ఛైర్మన్ గార్లపాటి శ్రీనువాసులు తెలిపారు. నిబందనలు అతిక్రమిస్తే అనుమతులు రద్దు చేసి.. తిరిగి వేలం నిర్వహిస్తామని హెచ్చరించారు. సంత వద్ద కనీస వసతులు కల్పించాలని గుత్తేదారుకు సూచించారు. కార్యక్రమంలో ఏఈ రాజు నాయక్, కౌన్సిలర్లు గోపిశెట్టి శివ, బైరమోనీ గౌరీశంకర్, రమేష్ రావు, సునీత, అంతటి శివ, సోమ్లా నాయక్, గడ్డం రమేష్, తగరం శ్రీను, కో-ఆప్షన్ సభ్యుడు ఖాదర్, నేతలు ఆకుల వెంకటేశ్, బాలరాజు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.




